calender_icon.png 25 October, 2024 | 9:03 AM

మన సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవి

25-10-2024 02:22:48 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతీ సంప్రదా యాలు గొప్పవని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర శాసనసభను జర్మనీలోని రైన్‌లాండ్ రాష్ట్ర బృందం సందర్శించింది. శాసనసభకు వచ్చిన వారికి స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వాగతం పలికారు.

అనంతరం సభాపతి ఛాంబర్‌లో సమావేశమైన తెలగాణ, జర్మనీ సభ్యుల బృందం వివిధ రంగాల్లో సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనసభలో 119 సభ్యులు, శానసమండలిలో 40 మంది సభ్యులు ఉన్నారని, శానససభ్యులను నేరుగా ప్రజలు ఎన్నుకుంటారని స్పీకర్ వివరించారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, నిజాం హయాంలో నిర్మించిన పాత అసెంబ్లీ భవనం రూ.49 కోట్లతో ఆధునికీకరణ చేస్తున్నారని త్వరలో శాసన మండలి కొత్త భవనంలోకి వెళ్తుందన్నారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు.