calender_icon.png 26 December, 2024 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన సినిమా, టాలెంటే మనల్ని కాపాడతాయ్

09-11-2024 12:00:00 AM

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘క’. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను తెరకెక్కించారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 31న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అతిథులగా హాజరయ్యారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “కిరణ్ నెగిటివిటీని తట్టుకుని ‘క’ వంటి సూపర్ హిట్ సినిమా చేశాడు. అతన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మంచి సినిమా చేసిన వారిని ప్రేక్షకులు తప్పకుండా ఆదిరస్తున్నారు. దర్శకులు సుజీత్, సందీప్ గురించి ప్రశంస లు వస్తున్నాయి. మీరిద్దరు రాజ్ డీకే అంత పేరు తెచ్చుకోవాలి’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. ఐదు సినిమాలు విజయాలు సాధించాయి.

ఈ దీపావళి మరోసారి వస్తుందో లేదో. ‘క’ సినిమా పోటీని తట్టుకుని నిలబడి ఘన విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. కిరణ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ప్రతిభతో నిలదొక్కుకున్నాడు. మరిన్ని విజయాలు సాధించాలి. ఇక్కడ ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు, గెస్ట్‌లుగా రారు. మన సినిమా, మన టాలెంటే మనల్ని కాపాడుతుంది’ అన్నారు. “ప్రొడ్యూసర్‌గా ఎన్నో కథలు వింటా.  ‘క’ క్లుమైక్స్‌ను గెస్ చేయలేకపోయా. ఇటీవల చూసిన బెస్ట్ స్క్రీన్ ప్లే ఇదే” అని నిర్మాత బన్నీ వాస్ అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ.. “క’ రిలీజ్‌కు ముందు పెద్ద చిత్రాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ ప్రేక్షకులు నిరూపించారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ నా ఒంటికి పట్టవేమో, ఆ రెండింటికీ ఒకేలా రియాక్ట్ అవుతున్నా. నాకు సక్సెస్ కంటే జర్నీ ముఖ్యం. ఏ హీరోనూ అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు” అన్నారు. డైరెక్టర్లు అనిల్ విశ్వనాథ్, వశిష్టతోపాటు నటి శరణ్య ప్రదీప్, దర్శకులు సుజీత్, సందీప్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.