calender_icon.png 13 March, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతలే మన ఆత్మ

13-03-2025 01:20:49 AM

  1. వారి స్వేదం, కష్టమే రాష్ట్రాన్ని పోషిస్తోంది
  2. దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ 
  3. సమ్మిళిత వృద్ధి.. సాంకేతిక నాయకత్వం.. ఇదే ప్రభుత్వ విజన్
  4. రూ.లక్ష కోట్లతో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
  5. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి బిల్లు
  6. అసెంబ్లీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): అన్నదాతలే తెలంగాణ ఆత్మ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభివర్ణించా రు. రైతుల  స్వేదం, కష్టం రాష్ట్ర ప్రజలను పోషిస్తోందని, వారిని ప్రోత్సహించి, సాధికారతను కల్పించడమే తమ నైతిక కర్తవ్యమని తెలిపారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి శాసనసభలో గవర్నర్ ప్రసంగిచారు. 

బడ్జెట్ అంటే కేవలం అంకెల కూర్పు కాదని, అది రాష్ట్ర విజన్‌కు ప్రతిబింబమన్నారు. ప్రభుత్వ పాలసీలు, కార్య క్రమాలు, సంక్షేమ చర్యలను తెలియజేసే ఒక ఆర్థిక నమూనా అన్నారు.  తెలంగాణ ప్రస్తుతం పురోగమించడమే కాదని, అది దాని స్వరూపాన్ని మార్చుకుంటున్నదని చెప్పారు. యువత, రైతులు, మహి ళలు, కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ప్రతిబింబించే దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

“సమ్మిళిత వృద్ధి, సాంకేతిక నాయకత్వం, స్థిరమైన అభివృద్ధే విజన్‌గా తెలంగాణ ముందుకెళ్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభు త్వ సంకల్పం దృఢమైనది. ప్రవేశపెట్టిన ప్రతీ కార్యక్రమం ప్రజా సాధికారత కోసం ఉద్దేశించింది. ప్రతిపౌరుడి సాధికారతకు మా ప్రభు త్వం కట్టుబడి ఉంది.” అని పేర్కొన్నారు. 

వ్యవసాయ రంగం పటిష్ఠం

రైతులకు అండగా ఉండేందుకు 22.35లక్షల మందికి రూ.20.61వేల కోట్ల రుణమా ఫీ చేసినట్లు గవర్నర్ తెలిపారు. రైతుభరోసా కింద రైతులకు నేరుగా రూ.12వేలను అందిస్తున్నామన్నారు. ఇంకా ఎన్నో పథకాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని పటిష్ఠ పర్చేందుకు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉ త్ప త్తి రికార్డుతో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు.  

తెలంగాణ ఓ భావోద్వేగం

తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, అది ఒక భావోద్వేగమని గవర్నర్ అన్నారు. తెలంగాణకు చెందిన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి వంటి గొప్ప వ్యక్తులను గుర్తించి గౌరవిస్తోందన్నారు. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..” అనే తెలంగాణ గేయం.. రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పోరాటాలు, త్యాగాలను గౌరవించడంతోపాటు భవిష్యత్ కోసం స్ఫూర్తిని నింపుతోందన్నారు.

మహాలక్ష్మి గేమ్‌ఛేంజర్

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం గేమ్‌ఛేంజర్ వంటిదని గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు మహిళలకు రూ.5005కోట్ల ఆదా అయినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఆమోదించిన ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా రూ.లక్ష కోట్లతో మహిళా పారిశ్రామికవేత్తలను త యారుచేస్తున్నట్లు చెప్పారు. 

సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందేలా చూడటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఫలితాల ఆధారంగా బీసీల కోసం 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి తమ సర్కారు ఒక బిల్లును ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే, ఎస్సీ వర్గీకరణ కోసం ఒక బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్నారు.

పారిశ్రామిక వృద్ధి, సర్వీసుల రంగ విస్తరణకు తెలంగాణ గమ్యస్థానంగా రూపొందు తున్నదన్నారు. స్థిర మైన ఇంధన సామర్థ్యంలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందు కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే దశకంలో సౌర, పవన, ఇంధన నిల్వలను పెంచడానికి ప్రభు త్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. 

విద్య, వైద్యానికి పెద్దపీట

తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసినట్లు గవర్నర్ వెల్లడించారు. విద్యార్థులకు సాయం చేయడా నికి 40శాతం డైట్ చార్జీలు, 200 శా తం కాస్మెటిక్ చార్జీలను పెంచామన్నా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇండిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.