- బీజేపీకి అంబేద్కర్ అంటే ఫ్యాషన్‌గా మారింది
- అమిత్‌షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్
- ట్యాంక్‌బండ్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ
హైదరాబాద్/ఖమ్మం/కామారెడ్డి, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తమకు దేవుడితో సమానమని, ఆయన పేరును లక్షలు, కోట్లసారైనా నిత్యం స్మరిస్తూ నే ఉంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. బీజేపీ నేతలకు అం బేద్కర్ పేరు ఫ్యాషన్‌గా మారితే.. తమకు మాత్రం ఆరాధ్య దైవమన్నారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహే శ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ హించారు. అమిత్‌షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సం దర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడు తూ.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్ర యత్నిస్తోందని, మనస్మృతిని అమలు చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు చేస్తున్నా యని విమర్శించారు. అమిత్‌షాపై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీ తీరును ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎండగడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.
మనుస్మృతిని, సావర్కర్‌ను అనుసరించే బీజేపీ నేతలు అంబే ద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడు తోందన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ ము న్షీ, టీపీసీసీ నేత వీ హనుమంతరావు, ఏఐసీసీ నాయకులు కొప్పు రాజు, ఎంపీ అనిల్ కు మార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రె డ్డి, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకం: భట్టి
భారత రాజ్యాంగాన్ని బలహీనపర్చాలన్నదే బీజేపీ ఎజెండా అని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసు నుంచి జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కృషితోనే భారత రాజ్యాంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాం గం కలిగిన ప్రజాస్వామిక దేశాన్ని, అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానపర్చారని అన్నా రు.
అమిత్‌షాను రాజీనామా కోరడం దేశ ప్రజల నైతిక హక్కు అన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాజ్యాంగం వల్లనే ఈనాడు ఉన్నత పదువుల్లో ఉన్నామని, అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలు దేశాన్ని అగౌరపర్చేలా ఉన్నాయని అన్నారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మేయర్ నీరజ, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఓబీసీ సెల్ నాయకులు కొత్తా సీతారాములు, నాగండ్ల దీపక్ చౌదరి, సౌజన్య, శేఖర్‌గౌడ్, బాలగంగాధర్ తిలక్ పాల్గొన్నారు.
పలు జిల్లాల్లో నిరసనలు
కేంద్రమంత్రి అమిత్‌షాను మం త్రి పదవి నుంచి తొలగించాలని డి మాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేం ద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్య క్షుడు ఇలియాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా, చంద్రశే ఖర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు పుట్నాల శ్రీనివాస్‌యాదవ్, గుడుగుల శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, దామోదార్‌రెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, అమ్ముల ముకుందం, దోమ కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కా మారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రె డ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్య క్రమంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చై ర్మన్ కాసుల బాల్‌రాజ్ పాల్గొన్నారు.