calender_icon.png 29 December, 2024 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా అర్ధనాథాలు వినబడటం లేదా..!

28-12-2024 07:06:12 PM

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): తమ భద్రత కోసం చేస్తున్న అర్ధనాదాలు సీఎం రేవంత్ రెడ్డికి వినబడడం లేదా అని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక అన్నారు. ఉద్యోగ భద్రత కోసం కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మె శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్ నియామకాలను రెగ్యులర్ పద్ధతిన నోటిఫికేషన్ వేసి రోస్టర్ ద్వారా నీయమకమై గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న వారి సంక్షేమం దృష్ఠ్యా సమ్మెను నివారించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షా ఉద్యోగుల సర్వీస్ ను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, పే స్కేలు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు మోహన్, ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తుకరం, గౌరవ అధ్యక్షుడు మోహన్, ఉపద్యక్షురాలు నాగసుధ, జిల్లా కోశాధికారి బోయిని నాగేష్, మీడియా ప్రతినిధి గేడేకార్ సంతోష్, అధికార ప్రతినిధి పవన్ కుమార్, కార్యదర్శి దుర్గం సందీప్ తదితరులు పాల్గొన్నారు.