calender_icon.png 22 February, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరమైన పనులు చేసుకుందాం

21-02-2025 01:03:22 AM

ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడమే మా లక్ష్యం 

విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): ప్రజలకు ఉపయోగకరమైన పనులను అత్యవసరంగా చేసుకుంటూ ముందుకు సాగుదామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఏనిమీది తాండా లో రూ;2.88 కోట్ల తో 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన, ఇబ్రహీంబాద్, టంకర, కొత్తపేట, సల్లోనిపల్లి, హన్వాడ పాఠశాలలో విద్యార్థులకు డబుల్ డిస్క్ బెం లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు ఎప్పుడు ఏది అవసరమో ఆ పనులను ముందుగా గుర్తించి ప్రత్యేక ప్రాథమిక ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.

200 యూనిట్ల వరకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ సమస్య పరిష్కారానికి 133 కెవి సబ్ స్టేషన్ గొండ్యాల గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదవాలని అప్పుడే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలియజేశారు. నిర్లక్ష్యం అనే మాట వారి దరిదాపుల్లో కూడా రాకూడదని, ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన సదుపాయాలని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఇ పివి రమేష్,; గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, లింగం నాయక్, టంకర కృష్ణయ్య, విజయ్ నాయక్, విద్యుత్ అధికారులు, ఎంపిడిఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.