calender_icon.png 18 January, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూకు సురవరం పేరు పెట్టాలి

23-09-2024 12:23:58 AM

ఎమ్మెల్యే ధన్‌పాల్ డిమాండ్

నిజామాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం సుధాకర్‌రెడ్డి పేరు పెట్టాలని, తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు అలాగే ఉంచాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధన్‌పాల్ మాట్లాడారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలిగించవద్దని కోరారు. పత్రిక సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, నిజాం నిరంకుశ పాలనపై పోరాటం జరిపిన సురవరం ప్రతాపరెడ్డి పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డెల గుండెల్లో నిలవాలంటే ఓయూకు ఆయన పేరు పెట్టాలని ధన్‌పాల్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా, నిజామాబాద్‌ను ఇందూరుగా, ఆదిలాబాద్‌ను ఏదులాపురంగా, మహబూబ్‌నగర్‌ను పాలమూరుగా, మహబూబాబా ద్‌ను మానుకోటగా, వరంగల్లును ఓరుగల్లుగా మార్చాలని కోరారు.