calender_icon.png 3 April, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియా పర్యటనకు ఓయూ ప్రొఫెసర్లు

21-03-2025 01:37:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్, సెంటర్ ఫర్ ఆస్ట్రేలియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ విజయ, సెంటర్ ఫర్ ఆస్ట్రేలియన్ స్టడీస్ కోఆర్డినేటర్, ఓయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఇంగ్లీష్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ పరిమళ కులకర్ణి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా(యూడబ్ల్యూఏ)ను సందర్శించనున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ, యూ  మధ్య అవగాహన ఒప్పందంలో భాగంగా చర్చలు, సహకార పరిశోధనను చేపట్టడానికి విజిటింగ్ స్కాలర్లుగా వారు అక్కడికి వెళ్లనున్నారు. మార్చి 22 నుంచి 3 ఏప్రిల్ వరకు జరిగే ఈ సందర్శనలో రెండు యూనివర్సిటీల మధ్య విద్యా సంబంధాలను బలోపేతం చేయడంతో పా  విద్యార్థి, అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధన భవిష్యత్తుపై వారు చర్చిస్తారు.