calender_icon.png 1 January, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. ఓయూ జేఏసీ నేతలకు బెదిరింపులు

29-12-2024 07:55:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓయూ పోలీస్ స్టేషన్(Osmania University Police Station) లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే చంపేస్తామంటూ అల్లు అర్జున్ అభిమానులు(Allu Arjun Fans) బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని ఓయూ జేఏసీ నేతలు(OU JAC Leaders) ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, దీంతో అల్లు అర్జున్(Allu Arjun) అభిమానుల పేరుతో వందల కాల్స్ వస్తున్నాయని వారు వెల్లడించారు. తమకు బన్నీ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందని జేఏసీ నేతలు వాపోయ్యారు.

బెదిరింపులు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ నేతలు ఓయూ జేఏసీ నేతలు ఓయూ పోలీసులను కోరారు. డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, గాయపడిన శ్రీతేజ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఈ ఘటనకు సినీ నటుడు అల్లు అర్జున్ కారణమంటూ ఓయూ జేఏసీ నేతలు ఇటీవల ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. మరణించిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బన్నీ ఇంటిపై టమాటోలు విసిరి, పూల కుండీలను ధ్వంసం చేశారు.