calender_icon.png 23 December, 2024 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళన కేసులో ఓయూ జేఏసీ నేతలకు బెయిల్

23-12-2024 10:26:42 AM

హైదరాబాద్,(విజయక్రాంతి: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద జరిగిన ఆందోళన కేసులో అరెస్టయిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులకు బెయిల్ మంజూరైంది. నిన్న అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన ఆరుగురు ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురంలోని జడ్జి నివాసంలో హాజరుపరిచారు. నాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేస్తూ, ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తుల ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.

జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న ఓయూ జేఏసీ కార్యకర్తలు  ప్రహరీ గోడ ఎక్కి లోపలికి దూకి ఇంటి ఆవరణలోని పూలకుండీలు ధ్వంసం చేసి, టామాటాలు విసిరారు. అంతేకాకుండ ప్లకార్డులు పట్టుకొని అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో ఐకాస అధికార ప్రతినిధి బోనాల నాగేశ్, మాదిగ, ఛైర్మన్ రెడ్డి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజ గౌడ్, కన్వీనర్ పి. ప్రకాశ్ తదితరులు ఉన్నారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని అప్పేందుకు ప్రయత్నించగా స్వల్ప తోపులాట జరిగింది.

అనంతరం నాయుకులు మాట్లాడుతూ... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిని రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి రూ.కోటి పరిహరం ఇవ్వాలని, ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న శ్రీతేజ్ ను మెరుగైన వైద్యం కోసం అమోరికా పంపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్  ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి సిబ్బందితో అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ మేనేజర్ కాంతారావు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.