ఓయూ పరిపాలనా భవవనం ఎదుట ఏబీవీపీ ధర్నా
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు పృథ్వితేజ, సుమన్‌శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ పరిపాలనా భవవనం ఎదుట విద్యార్థులతో కలసి వారు ధర్నా నిర్వహించారు. సెమిస్టర్ పరీక్షలు జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఫలితాలు విడుదల చేయకపోవడం అధికారుల చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.
వెంటనే పరీక్ష ఫలితాలను విడుదల చేయాలన్నారు. టీచిం గ్, నాన్‌టీచింగ్ సిబ్బంది కొరతతో ఉన్నవారికే బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి గురికావడం వల్ల తప్పిదాలు జరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతులు, ల్యాబ్, మెస్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల హాస్టల్‌కు కిలోమీటర్ దూరంలో మెస్ ఉండటంతో చీకట్లో వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరిప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ రాజు, నాయకులు.. శివశంకర్, శేఖర్, మహేశ్, రాహుల్, నవీన్, మనీశ్, స్వాతి, పల్లవి, రేష్మ, సంజన పాల్గొన్నారు.