calender_icon.png 9 February, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ విద్యార్థులపె ఓయూ ఫోకస్

09-02-2025 12:51:39 AM

  • ప్రస్తుతం ‘ఉస్మానియా’లో 46 దేశాల విద్యార్థులు

ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల నుంచే అత్యధికం

కరోనా తర్వాత విదేశీ విద్యార్థుల తగ్గుముఖం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8  (విజయక్రాంతి): విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదవాలనే ఆకాంక్షతో నగరానికి చెందిన ఎంతో మంది విద్యార్థులు ప్రతీ ఏడాది విదేశాలకు వెళ్తుంటారు. కానీ మన భాగ్యనగరానికి తలమానికం  ఉన్న చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ కూడా విదేశీ విద్యార్థులతో కలకల  ఓయూ, యునివర్సిటీ అనుబంధ కాలేజీల్లో విదేశీ విద్యార్థులు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యసిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తం గా 46 దేశాల కు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తుండడం వి  విదేశీ విద్యార్థుల్లో ఆసియాతో పాటు ఆఫ్రికా, యూరప్ దేశాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉండగా.. అమెరికా, ఇంగ్లండ్‌కు చెందినవారు కూడా ఉన్నారు.

యెమన్ నుంచి 65 మంది, యూఎస్‌ఏ నుంచి 48 మంది, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 30 మంది విద్యార్థులుండ డం గమనార్హం. ఇటీవల కాలంలో మరికొన్ని దేశాల విద్యార్థులను ఆహ్వానిస్తూ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం సహా ఓయూ ఓఐఏ (ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

వీసీ స్పెషల్ ఫోకస్

ఉస్మానియా యూనివర్సిటీకి విదేశీ విద్యార్థులను ఉన్నత విద్య కోసం ఆహ్వానించేందుకు ఓయూ వీసీ కుమార్ మొలుగారం స్పెషల్  ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో తుర్క్‌మెనిస్థాన్ ఎంబ సీ అధికారులు ఓయూను సందర్శించారు. ఓయూతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

కాగా ఇప్పటికే ఓయూ వీసీ కుమార్ మొలుగారం, ఓయూ ఆఫీస్ ఆఫ్  ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ, సహా అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నా రు. కాగా ఓయూలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పెంచేందుకు ఇప్పటికే వీసీ ఢిల్లీలోని ఇండియన్ ఎంబసీ అధికారుల ను కూడా కలిసినట్లు తెలుస్తోంది. 

కరోనా తర్వాత తగ్గుముఖం

ఓయూకు విదేశీ విద్యార్థుల రాక 1998లో మొదలైనట్లు తెలుస్తోంది. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు రావడం క్రమంగా పెరిగి 2014 విద్యా సంవత్సరం నాటికి ఓయూ, అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్య 4480 మందికి చేరింది. అనంతరం క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

కరోనా కారణంగా 2020 తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గిపోయింది. రెండేండ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఆఫ్గానిస్థాన్, చుట్టుపక్క దేశాల విద్యార్థులు రావడం తగ్గినట్లు తెలుస్తోంది. పలు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులుండడం కూడా విద్యార్థుల రాకపై ప్రభావం పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. 

విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్, వసతులు

విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఓయూ అధికారులు ప్రత్యేక హాస్ట  వసతులు ఏర్పాటు చేస్తున్నారు. 20  విద్యాసంవత్సరంలో ఓయూలో మొత్తం విదేశీ విద్యార్థులు దాదాపు 419 మంది ఉండగా, యూనివర్సిటీలోని వివి  కాలేజీల్లో 163, కాన్‌స్టిట్యూయెంట్ (అనుబంధ) కాలేజీల్లో 184, యూనివర్సిటీ గుర్తింపు పొందిన కాలేజీల్లో 72 మంది విద్యార్థులు చదువుతున్నారు.

వీరిలో 305 మంది పురుషులు ఉండగా.. 114 మంది మహిళా విద్యార్థినులున్నారు. 20  విద్యాసం వత్సరంలో దాదాపు 135 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు తెలుస్తోం ది. ఓయూ క్యాంపస్ కాలేజీల్లో 163 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం నిజాం కాలేజీలో 112 మంది, సైఫాబాద్ సైన్స్ కాలేజ్‌లో 57 మంది చదువుతుండడం గమనార్హం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఓయూలో చదువుతున్న విదేశీ  విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ నెల వారితో సమావేశమై పరిష్కరించేలా ఓయూ ఓఐఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.