హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌కి ఉస్మానియా యూనివర్శిటీ డాక్టరేట్‌ను (పీహెచ్‌డీ) ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాల యంపీహెచ్‌డీ స్కాలర్ పొందిన జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ విశ్రాంత ప్రొఫెసర్ ఏకె వాసుదేవచారి పర్యవేక్షణలో ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఇన్ తెలంగాణ ఎ ఫోకస్ ఆన్ ఎస్సీ ఉమెన్’ అనే అంశంపై గోవింద నరేష్ పరిశోధన సమర్పించారు. హనుమకొండ జిల్లా దామోర మండలం పులుకూర్తి గ్రామానికి చెందిన గోవిందు నరేష్ అంచెలంచెలుగా ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. తన పీహెచ్‌డీ పరిశోధనకు మార్గనిర్దేశం చేసిన ప్రొ. ఏకె వాసుదేవచారికి, ఇతర ఎకనామిక్స్ ప్రొఫెసర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.