30-03-2025 12:18:01 AM
రద్దు చేయాల్సిందే..
ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్, నిరసన
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 29 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలను నిషేధిస్తూ యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంతోపాటు అనేక పోరాటాలకు వేదిక అయిన ఓయూలో మూడేళ్లు అధికారంలో ఉండే వైస్ ఛాన్స్‌లర్ రాజ్యంగా విరుద్ధంగా సర్క్యులర్ ఇవ్వడం పరిపాలనలో అజ్ఞానాన్ని సూచిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.