calender_icon.png 9 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆబర్న్ యూనివర్సిటీతో ఓయూ ఒప్పందం

09-02-2025 01:26:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అమెరికా అలబామా రాష్ట్రం లోని ఆబర్న్ యూనివర్సిటీతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యా భాగస్వామ్యం ఒప్పం దం చేసుకుంది. శనివారం ఓయూ పరిపాల నా భవన్‌లో ఆబర్న్ యూనివర్సిటీతో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్(ఓఐఏ) నోడల్ కార్యాలయం అధికారు లు ఎంవోయూపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ విద్యా సంబంధాలను పెంచడంలో ఈ ఎంవోయూ ఒక మైలురాయి అని అన్నా రు. ఈ భాగస్వామ్యం తమ యూనివర్సిటీ విద్యా సామర్థ్యాన్ని పెంపొందిస్తోందన్నారు. ఆబర్న్ విశ్వవిద్యాలయ బృందానికి అటవీ, పర్యావరణ కళాశాల డీన్ ప్రొఫెసర్ జానకి అలవలపతి ప్రాతినిధ్యం వహించారు.

కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్‌రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్.జితేంద్రకుమార్, ఎంవోయూ కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ జిబిరెడ్డి, ఓఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.విజయ, జేడీ డా.హమీద్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొ.జార్జ్ ఫ్లవర్స్, అడల్ట్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ రిక్రూటింగ్ డైరెక్టర్ ప్రొ.షీనా స్టీవర్ట్, ప్రొఫెసర్ గోవింద్ కన్నన్, వ్యవసాయ కళాశాల పైల్ట్రీ సైన్స్ హెచ్‌వోడీ తదితరులు పాల్గొన్నారు.