- కొత్త డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
- నెలాఖరులోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశం
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ఈ నెలాఖరు నాటికి ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఉస్మానియా కొత్త హాస్పిటల్ పనులకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ పనులు చేపడ్తున్న ఆర్‌అండ్‌బీ శాఖ రూపొందించిన కొత్త హాస్పిటల్ డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈనెలాఖరులోగా ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పుడు నిర్మించబోయే హాస్పిటల్ వందేళ్ల వరకు ప్రజలకు సేవలు అందించేలా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ నెల 11న ఇదే అంశంపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఆమేరకు సోమవారం సరికొత్త డిజైన్లను పరిశీలించారు.