29-01-2025 12:55:18 AM
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో నూతనంగా నిర్మించబోయే ఉస్మానియా ఆస్పత్రి భవిష్యత్తు తరాలకు అత్యుత్తమ సేవలు అందించేలా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాల డిజైన్లు, శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన పనులపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు.
గోషా మహల్‌లో ఈ నెల 31న ఉస్మాని యా నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని, ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 25న సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మాని యా హాస్పిటల్ డిజైన్లలో పలు మార్పులు సూచించారు. ఈ మేరకు భవన నమూనాల్లో ఆర్కిటెక్ట్ మార్పు లు చేశారు. ఆయా డిజైన్లను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా నిర్మాణాలు ఉండాలన్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రజలకు అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సీఎం సెక్రటరీ సంగీత సత్యనారాయ ణ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివశంకర్ లోతేటి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ నరేంద్ర కుమార్, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ సహాయ్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు