calender_icon.png 31 January, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియాపై పునరాలోచన చేయాలి

31-01-2025 02:06:21 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): తాను, బీజేపీ డెవలప్‌మెంట్‌కు వ్యతిరేకంగా కాదనీ.. ఉస్మానియా దవాఖానను గోషామహల్‌కు తరలించాలనే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫిసియో సభ్యుడి హోదాలో ఈటల హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మా  రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తీర్మానం చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వార్డు సభలలో ప్రభుత్వం, బల్దియా పాలకవర్గం పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులంతా భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హైదరాబాద్ మహానగరం మరిం  విస్తరిస్తుంది, కానీ.. కోర్ సిటీగా ఉన్న చార్మినార్ తదితర ప్రాంతాలు విస్తరించే అవకాశాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రిని పాత స్థలంలోనే వర్టికల్‌గా నిర్మాణం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈటల.. మేయర్‌ను కోరారు.