01-03-2025 10:36:13 AM
హైదరాబాద్: ఉస్మానియా ఫోరెన్సిక్ టీమ్(Osmania Forensic Team) ఎస్ఎల్ బీసీ టన్నెల్ దగ్గరకు చేరుకుంది. ఇప్పటికే టన్నెల్ వద్దకు మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అధికారులు మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాద స్థలం వరకు అధికారులు లోకో ట్రాక్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల బురద, మట్టి, రాళ్లు ఉన్నాయి. లోకో ట్రైన్ను ఉపయోగించి 13.5 కి.మీ. వరకు తీసుకొచ్చి మట్టిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని SLBC సొరంగంలో ఒక భాగం కూలిపోయిన ఏడు రోజుల తర్వాత కూడా వారి ఆచూకీ ఇంకా తెలియకుండానే ఉన్న ఎనిమిది మంది కార్మికుల కోసం వివిధ ఏజెన్సీలకు చెందిన వందలాది మంది రెస్క్యూ సిబ్బంది చర్యలు కొనసాగించారు.