- దవాఖానలో నెలలో ఐదు కాలేయ మార్పిడి సర్జరీలు
- రూ.30 లక్షల నుంచి 40 లక్షల ఖరీదైన సర్జరీ ఉచితం
- ప్రభుత్వ వైద్యంపై భరోసానిస్తున్న వైద్యులు
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): కాలేయ మార్పిడి అత్యంత ఖరీదుతో కూడుకున్న శస్త్రచికిత్స. సాధారణంగా ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఒక్కో కాలేయ మార్పిడి సర్జరీకి యాజమాన్యాలు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేస్తాయి. అయి నా యాజమాన్యాలు వందశాతం సర్జరీ సక్సెస్ అనే గ్యారెంటీ ఇవ్వవు.
కానీ ఉస్మానియా వై ద్యులు మాత్రం ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ వైద్యంపై పేదలకు భరోసా కల్పిస్తున్నారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే పరిస్థితి ఉన్న తరుణంలో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 40 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేసి ఉస్మానియా వైద్యులు శభాష్ అనిపించుకున్నారు.
ఉస్మానియా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విజయవం తంగా కాలేయ మార్పిడి సర్జరీలు చేసి రికార్డు సృష్టించారు. ప్రభుత్వ దవాఖానల్లో కూడా అత్యాధునిక, ఖరీదైన వైద్యం ఉచితంగా అం దించడమే కాకుండా రోగిని కాపాడతామని నిరూపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేష్ సహాయ్ సహా ఉన్నతాధికారుల సహకారంతోనే శస్త్రచికిత్సలు సాధ్యమయ్యాయని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.
నెల రోజుల్లోనే ఐదుగురికి కాలేయ మార్పిడి..
అరుదైన జన్యపరమైన సమస్యలతో ఐదుగురు నిరుపేద రోగులు కాలేయ సమస్యతో ఉస్మానియా ఆసుపత్రికి వచ్చారు. వీరిలో ముగ్గురికి జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా అవయవదానం లభించింది. ఇద్దరు రోగులకు మాత్రం వారి బంధువులు తమ కాలేయం దానం (కొంత భాగం) చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో వైద్యులు ఈ ఐదుగురికి నెల రోజుల్లో విజయవంతంగా సర్జరీలు చేశారు.
బుధవారం ఆ ఐదుగురు డిశ్చార్జి కూడా అయ్యారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వీరికి జీవితాంతం ఉచితంగా మందులను అందిస్తామని వైద్యులు వెల్లడించారు. దేశంలోని ఏ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఒక నెలలో ఇన్ని కాలేయ మార్పిడి సర్జరీలు చేయలేదని వారంటున్నారు. నిరుపేదల ప్రాణాలు నిలబెట్టిన వైద్యులకు రోగుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
కాలేయ మార్పిడి జరిగింది వీరికే..
* అజిత్‌కుమార్ (2), నెర్రపాలెం, ఖమ్మం జిల్లా
* సాత్విక్ గౌడ్ (7), రాణిగూడెం, సూర్యాపేట జిల్లా
* జీ వెంకటేశ్ (20), ఈడిగోనిపల్లి, జోగుళాలాంబ గద్వాల జిల్లా
* ఎం హర్షప్రియ (30), హనుమకొండ
* ఎం వెంకటేశ్ (40) బ్రాహ్మణపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా