calender_icon.png 12 January, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానయా నెలాఖరుకల్లా శంకుస్థాపన

12-01-2025 01:09:21 AM

  1. కొత్త దవాఖాన నిర్మాణానికి ఏర్పాట్లు చేయండి 
  2. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లు ఉండాలి
  3. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ఈ నెలాఖరులోగా ఉస్మానియా దవాఖాన కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకో వాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఉస్మానియా కొత్త దవా ఖాన భవనం నిర్మాణంపై శనివారం తన నివాసంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వెద్యారోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ మ్యాప్‌లలో పలు మార్పులు, చేర్పులను సీఎం సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా భవన నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని వెల్లడించారు.

భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లుఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలని స్పష్టంచేశారు. అత్యాధునిక వసతులతోపాటు రోగుల సహాయకులు సేద తీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలని చెప్పారు.

కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా అత్యాధునిక వసతులతో భవన నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉస్మానియా కొత్త భవనాలు, ఇతర నమూనాలకు సంబం ధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని చెప్పారు.