ఇల్లందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియా జియం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఏరియా ఓయస్డి వి.కృష్ణయ్య నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభి౦చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి రవాణా, అన్ని రంగాలలో కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుందని, దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన మన సింగరేణి దేశంలోని వివిధ సంస్థలకు ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నాణ్యమైన బొగ్గును గత 134 సంవత్సరాలుగా సరఫరా చేస్తూ మన దేశ ఆర్థిక ప్రగతిలో సుస్థిర స్థానం సంపాదించుకుందని, అయితే ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థ కూడా తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని,ఏ సంస్థకైనా దాని మనుగడను మరియు పురోభివృద్ధి ఆ సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు ఉత్పత్తి అయిన వస్తూ నాణ్యత పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు తన వంతు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం మన వినియోగదారుల పట్ల మన కర్తవంగా భావించాలని, అప్పుడే మనకు మన వినియోదారుల సంపూర్ణ విశ్వాసాన్ని పొందడం సాధ్యమవుతుందని విషయాన్ని మనం గ్రహించాలని అంతే కాకుండా నాణ్యమైన బొగ్గు సరఫరా ద్వారా తక్కువ ధరకే విద్యుత్ ఉత్పాదక సాధ్యమై తద్వాల వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా ఇల్లందు ఏరియాలోని జె కె ఉపరితల గని, కోయాగుడెం ఉపరితలగనిలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభించి అందరు అధికారులు, ఉద్యోగులచే నాణ్యత ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు.