calender_icon.png 23 October, 2024 | 12:53 PM

ఓరుగల్లులో జోరువాన

02-09-2024 01:58:02 AM

హనుమకొండ (విజయక్రాంతి): ఓరుగల్లును వరుణుడు ముంచెత్తాడు. మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారంతండా జలది గ్భంధంలో చిక్కుకుంది. ఆకేరు వాగు ఉధృతికి తండాలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇంటి పైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అర్ధరాత్రి నుంచి ఇంటి డాబా పైనే ఉన్నామం టూ సమీప బంధువులకు ఫోన్లు చేసి కాపాడాలంటూ వేడుకు న్నారు. గార్ల మండలంలోని పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల మండ లం వరద ప్రవాహంలో చిక్కుకుంది. బయ్యారంలో పాకాల వాగు వరద తాకిడికి పంట పొలాలు నీట మునిగాయి. ములుగు ఏజెన్సీని వర్షం ముంచెత్తింది. జిల్లాలోని పస్రా, తాడ్వాయి మధ్యలోని జలగలెంచ గ్రామం వరదలో చిక్కుకుంది.

భూపాలపల్లిలో కురుస్తున్న వర్షాలకు ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాకాల వాగు మత్తడిపోస్తోంది. మాదన్నపేట చెరువు జలకళను సంతరించుకుంది. వరంగల్ నగరంలోని పలు కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. ఉర్సుగుట్ట ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలోకి భారీగా వదరనీరు చేరింది. హనుమకొండ చౌరస్తాలో వరదనీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. భద్రకాళీ చెరువు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు వేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.