09-02-2025 12:06:42 AM
రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వారు నిర్మించిన తోరణాలు, రాజ ప్రసాదాలు, ప్రజా వినియోగ భవనాలు, దేవాలయాలు, చెరువుల వంటి సాంస్కృతిక చిహ్నాలు గతకాలపు వైభవాలకు, వాస్తుకళ నైపుణ్యాలకు, రాచఠీవికి నిదర్శనాలుగా మన కండ్ల ముందు నిలిచే ఉన్నాయి. అలాంటివాటిలో వరంగల్ కాకతీయ కళాతోరణం ఒకటి.
తెలంగాణ చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అద్భుత నిర్మాణం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు.. కాకతీయ రాజవంశం ఘన చరిత్ర, కళాత్మక నైపుణ్యం, శిల్పకళా వైభవానికి నిదర్శనం. అంతటి ప్రాధాన్యం గల కాకతీయ కళాతోరణం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌లో ప్రము ఖ పర్యాటక కేంద్రంగా, కాకతీయ సామ్రాజ్య వైభవానికి నిదర్శనంగా వరంగల్ కోట నిలిచింది. క్రీ.శ 750 నుంచి 1323 వరకు కాకతీయుల సామ్రాజ్యం కొనసాగింది. దక్షి ణ భారతదేశంలో అధిక భాగాన్ని పాలించిన కాకతీయులు హనుమకొండ, వరంగల్ రాజధానిగా చేసుకొని పాలించారు.
కాకతీయ రాజులు వారికి శక్తి సామర్థ్యాలను చాటుకోవడంతో పాటు, శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భారీ కోట నిర్మించారు. గణపతి దేవుడి కాలంలో కోటను మరింత విస్తరించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీ యులు శివ భక్తులు కావడంతో కోట ఆవరణలో స్వయంభు ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు నిర్మించారు.
ఈ ప్రాంగణాన్ని స్వ యంభూ దేవాలయ ప్రాంగణంగా పిలిచా రు. ఈ ప్రాంగణానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షణం నాలు గు దిశలలో కాకతీయ కళాతోరణంగా పిలిచే నా లుగు అలంకార ద్వారాలు 80 అడుగుల ఎత్తుతో రాతితో నిర్మించారు.
గత వైభవాన్ని గుర్తుకుతెస్తూ..
వరంగల్ కాకతీయ కళాతోరణం.. 12వ శతాబ్దంలో కాకతీ య రాజుల కాలంలో నిర్మించారు. ఈ కళాతోరణం వరంగల్ కోటలోని శివాలయానికి ప్రవేశ ద్వారంగా ఉండేది. కాకతీయ రాజులు తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ అద్భుతాన్ని నిర్మించారు. వరంగల్ కోట నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన ద్వారాలను కలుపుతూ..
గణపతి దేవుడు ఖివుడు వరంగల్ చుట్టూ 15 మీటర్ల ఎత్తయిన రాతి గోడను నిర్మించారు. ఈ గోడపై బురుజులు కూడా ఉన్నాయి. ఈ ద్వారాల ను కాకతీయ కళాతోరణాలు, కీర్తి తోరణ శిల్పాలుగా పిలుస్తున్నారు.
కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్ కాదు. దాని మీద కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో ఈ తోరణాలు తెలియజేస్తాయి. నిలబడ్డ నాలుగు పిల్లర్లు వాళ్ల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనం.
కళాతోరణం ప్రత్యేకతలు
హంసలు, మొసళ్లు, పద్మాలు, తలకిందులుగా వేలాడినట్టుండే తామెర మొగ్గల వం టి ఆకృతులు.. ఇలా ఎన్నో అంశాల కలబో త వరంగల్ కాకతీయ తోరణాలు. ఈ శిల్పా లు కాకతీయ శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనం. కాకతీయుల ధైర్య సాహసాలకు నిద ర్శనంగా ఈ కళాతోరణాలు నిలుస్తాయి. ఢిల్లీ సుల్తానులపై కాకతీయ సేనలు చేసిన యుద్ధం గురించి..
గొడిశాలలో ఉన్న కాకతీయుల కళాతోరణం తెలుపుతోంది. తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారిక చిహ్నం గా కాకతీయ కళాతోరణాన్ని ప్రకటించారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి ప్రతీక. వరంగల్ కాకతీయ కళాతోరణం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక నిర్మాణాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఇది చరిత్ర, కళ, వాస్తు శాస్త్రాల అద్భుత కలయిక.
కాకతీయ సామ్రాజ్యానికి..
ఈ తోరణాలను చూడగానే కాకతీయ సామ్రాజ్యం, రుద్రమదేవి గుర్తుకువస్తుంది. దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల రాజధాని వరంగల్ కోటలో తోరణాలు ధ్వంసం కాకుండా ఉండటంతో కాకతీయులకు చిహ్నంగా మారాయి.
నాలుగు ద్వారా లను గెట్ వేగా కాకతీయులు వీటిని నిర్మించిన కాలక్రమేణా కాకతీయ కళాతోరణంగా, కీర్తితోరణంగా భావిస్తున్నారు. ఈ తోరణమే పర్యాటకులను ఆకర్షిస్తోంది. కోటలో కాకతీయులు నిర్మించిన ఆలయాలు, శిల్ప సంపద ధ్వంసం కాగా తోరణాలు కాకతీయుల కళ నైపుణ్యం, టెక్నాలజీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రత్యేక నిధులు కేటాయించాలి
వరంగల్‌లో కాకతీయ పరిపాలన సాగిందనే కారణంతోనే గత ప్రభుత్వాలు ఇక్కడి నిర్మాణాలు, తోరణాలను నిర్లక్ష్యం చేశాయి. పేరుకు కాకతీయ ఉత్సవాలు జరిపినా.. ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు. ఆనాటి కాకతీయ పాలనను గుర్తు చేసే రాజప్రసా దాలు, కట్టడాలు, చెరువులు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిని ప్రభుత్వం గుర్తించి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవన్నీ జరగాలంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. వరంగల్ కోట అనగానే చాలామంది ఓ పర్యాటక ప్రదేశంగా మాత్రమే చూస్తున్నారు. చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి.
వరంగల్ చరిత్ర, కాకతీయపాలనపై ప్రస్తుత ఇంగ్లిష్ మీడియంలో ఎలాంటి సిలబస్ లేకపోవడంతో ఈతరం విద్యార్థులు చరిత్రకు దూరమవుతు న్నారు. ఈ అంశాలపై ప్రభుత్వమే చొరవ చూపాలి.
దర్గం సారయ్య, పరిశోధక విద్యార్థి, వరంగల్
కళాతోరణాలను కాపాడుకోవాలి..
తెలంగాణలో చాలా తోరణాలు, కట్టడాలున్నాయి. గత చరిత్రకు సం బంధించిన ఆనవాళ్లు కోల్పోయినా.. నేటికీ కొన్ని దర్శనమిస్తున్నాయి. అయితే ఆయా దేశాలు తమ వారసత్వాన్ని గొప్పగా కాపాడుకుంటున్నా యి. కానీ, మనదేశంలో వారసత్వ సంపద నిర్లక్ష్యానికి గురవుతోంది. తెలంగాణ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలంటే వరంగల్ కళాతోరణాలను కాపాడుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాకతీయ రాజుల పౌరుషం అంటే మొద టిగా గుర్తు వచ్చే పేరు రాణి రుద్రమ దేవి. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. అలాంటివాళ్లను గుర్తించుకుంటూ విలువైన సంపదను కాపాడుకోవాలి.
అయితే ఒక్కో కట్ట డం వెనుక ఎందరో శిల్పుల కష్టం దాగి ఉంది. మనం రాజులను, రాణులను ఎలా గౌరవించుకుంటామో.. శిల్పులను గౌరవించుకోవాలి. ఆనాటి శిల్ప సంపదను పరిరక్షించుకుంటేనే శిల్పులకు సరైన గౌరవం ఇచ్చినట్టువుతుంది.
వేముగంటి మురళీకృష్ణ, చరిత్రకారుడు