28-04-2025 01:21:30 AM
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 27: మంచి ర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో బెల్లంపల్లి శాసన సభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సహకారంతో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా ఆరోగ్య శిభిరం నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఏరియా ఆస్పత్రి లో కామినేని హాస్పటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆర్థోపెడిక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి వైద్య సేవ కార్యక్రమాలు మరిన్ని జరుపుకుంటామన్నారు. ఈప్రోగ్రాం కండక్ట్ చేసిన కామినేని హాస్పిటల్ వారినీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్ వైద్య బృందం,తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, బెల్లంపల్లి పట్టణ కాం గ్రెస్ కార్యకర్తలు నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.