calender_icon.png 13 February, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్-2 పనుల్లో వేగం పెంచాలి

03-05-2024 01:57:34 AM

జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి): ఔటర్‌రింగ్ రోడ్డు పరిధిలో విస్తరిం చిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీరు సరఫరా చేసేందుకు జలమండలి చేపట్టిన ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు ఫేజ్ పనులను వేగవంతం చేయాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ప్యాకేజీ లో ఉన్న తుక్కుగూడ, పహాడిషరీఫ్, సుల్తాన్‌పూర్, కాషాన్‌గుట్ట, గుర్రంగూడ, కమ్మ గూడ, తిరుమలనగర్, నందిహిల్స్ రిజర్వాయర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజీ నిర్మిస్తున్న 33రిజర్వాయర్లకు గాను, ఇప్పటికే 22రిజర్వాయర్లు పూర్తయ్యాయి. మిగిలిన 11రిజర్వాయర్ల నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని మిగిలిన పనులను జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. 

ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు స్వరూపం

ఓఆర్‌ఆర్ ఫేజ్‌t ప్రాజెక్టును మొత్తం రూ. 1200 కోట్ల వ్యయంతో చేపట్టగా, కొత్త గా 73 సర్వీసు రిజర్వాయర్లు (138 మిలియన్ లీటర్ల సామర్థ్యం), 2,988 కిలోమీటర్ల మేర కొత్తపైపులైన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తైతే  ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాల్టీలు, 24 గ్రామ పంచాయతీల పరిధిలోని 3.6లక్షల కుటుంబాలు, 25లక్షల మందికి మేలు జరుగుతు ంది. రెండు దశలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. మొదటి దశలో రూ.613కోట్లతో సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబా ద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర పరిధిలో 33 సర్వీసు రిజర్వాయర్లు, 1522 కిలోమీటర్ల పైపులైన్లను విస్తరించనున్నారు. దీంతో 4.36లక్షల మంది మేలు జరుగుతుంది. అలాగే ఫేజ్ రాజేంద్రనగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్భుల్లాపూర్, పటాన్‌చెరు, ఆర్సీపురం, బొల్లారం ప్రాంతాలలో 38సర్వీసు రిజర్వాయర్లు, 1, 270 కిలో మీటర్ల మేర పనులు చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో 1.96లక్షల మందికి లబ్ధి కలగనుంది.