calender_icon.png 13 January, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ యువతికి అధ్యాపకుడి వేధింపులు

04-12-2024 03:14:16 AM

మేడ్చల్, డిసెంబర్ 3: కాలేజీలో లెక్చరర్ వేధిస్తున్నాడని అనాథ యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే ఆమె పాలిట శాపమైంది. తనకు న్యాయం జరుగుతుందని భావించిన ఆ యువతికి న్యాయం లభించకపోగా, తిరిగి ఆమెపైనే కేసు నమోదైంది. విజయవాడకు చెందిన బ్లెస్సీ సందక మేడ్చల్ మండలం డబీల్‌పూర్‌లోని బైబిల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ ఫైనలీయర్ చదువుతోంది.

ఓ అధ్యాపకుడు  మానసికంగా వేధిస్తుండటంతో ఆమె డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఫలితం లేక నవంబర్ 1న మేడ్చల్ పీఎస్‌లో కంప్లుంట్ ఇచ్చింది.  రెండు నెలలైతే తన చదువు పూర్తవుతుందని, తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని బాధితురాలు కోరింది.

కాగా కాలేజీలో గొడవ చేసి ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలిగించిదని యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో బాధితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై సీఐ సత్యనారాయణ వివరణ కోరగా బ్లెస్సీ సందక ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుందని చెప్పారు. తోటి విద్యార్థులకు ఇబ్బంది కలిగించినందుకు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్లెస్సీసందకపై కేసు నమోదుచేసినట్లు చెప్పారు.