22-04-2025 01:33:00 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: నాలుగు రోజుల పర్యటన కోసం తొలిసారి భారత్‌కు వచ్చి న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. చర్చలో భాగంగా ఇరువురు నేతలు వాణిజ్యం, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలపై చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం లో పురోగతిని స్వాగతించారు.
వివిధ భౌగోళిక సమస్యల గురించి కూడా ఈ ఇరువురు నేతలు చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్చలు అవసరం అన్నారు. భారత్-అమెరికా మధ్య శక్తి, రక్షణ, సాంకేతికత విషయాల్లో సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
వాణిజ్య సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూలై వరకు నిలిపి వేసిన విషయం తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, ఉష చిలుకూరిల భారత పర్యటన అద్భుతంగా సాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భేటీ సందర్భంగా ప్రధాని మోదీ వాన్స్ పిల్లలకు నెమ లి పింఛాలను కానుకగా ఇచ్చారు. వారితో సంభాషించి, వారిని ఒళ్లో కూర్చోబెట్టుకుని కాసేపు ఆడించారు.
ఇదే తొలిసారి..
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేడీ వాన్స్ భారత్‌లో పర్య టించడం ఇదే తొలిసారి. సోమవారం ఉద యం 9.30 ప్రాంతంలో ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్న వాన్స్‌కు కేం ద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులు స్వాగతం పలికారు. సైనిక దళాలు వాన్స్‌కు గౌరవవందనం చేశాయి. జేడీ వాన్స్, ఆయ న సతీమణి ఉష చిలుకూరి, ముగ్గురు పిల్ల లు ఇవాన్, వివేక్, మిరాబెల్ భారత్‌కు వచ్చారు.
వాన్స్ పిల్లలు భారతీయ సంప్రదా య దుస్తుల్లో ఆకట్టుకున్నారు. అనంతరం జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్షర్‌ధామ్ ఆలయ సందర్శన కు వెళ్లిన వాన్స్ కుటుంబానికి పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఆలయంలో ఆయనకు లభించిన స్వాగతానికి వాన్స్ ముగ్ధుడయ్యారు. ‘మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు.
ఈ అందమైన ప్రదేశంలోని మాకు సాదరస్వాగతం లభించింది. ఇంత శ్రద్ధతో ఇంత అందమైన దేవాలయాన్ని నిర్మించడం నిజంగా అద్భుతం. భారత ఘనత అమోఘం. మా పిల్లలు ఎంతో ఆనందించారు’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. జనపథ్‌లోని హస్తకళల ఎంపోరియాన్ని సందర్శించిన వాన్స్ దంపతులు టీ బ్యాగ్స్, తేనె, మరిన్ని వస్తువులు కొనుగోలు చేశారు. మంగళవారం జైపూర్‌ను సందర్శించనున్నారు.
అనంతరం వాన్స్ రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే సభలో ప్రసంగించనున్నారు. 23న వాన్స్ ఆగ్రాలోని తాజ్‌మహల్ ను సందర్శించనున్నారు. చేతి వృత్తులకు పేరుగాంచిన శిల్పగ్రామ్‌ను కూడా వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. ఆగ్రా పర్యటన తర్వాత వాన్స్ కుటుంబం జైపూర్‌లో రాత్రి బస చేసి, 24న అమెరికాకు పయనమవుతారు.