- ఇబ్బందులు పెడితే బ్లాక్ లిస్టులో పెడతాం
- కాలేజీలకు ఉన్నత విద్యామండలి హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కళాశాల ట్యూషన్ ఫీజు చెల్లించలేదన్న కారణాలతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టొద్దని ఉన్నత విద్యామండలి సూచించింది. ఇబ్బంది పెడితే కాలేజీలకు బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది.
దీని ప్రభా వం కళాశాల అఫిలియేషన్‌పై కూడా ఉంటుందని సూచిస్తూ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు, జేఎన్టీయూ, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌ఏఎఫ్ వర్సిటీ రిజిస్ట్రార్‌లకు సోమవారం లేఖలు రాసింది. తమ పరిధిలోని కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఉన్నత చదువులు, ఉద్యోగా లకు దరఖాస్తు చేసుకునేందుకు కళాశాల యాజమాన్యాలు తమ సర్టిఫికె ట్లు ఇవ్వడంలేదని ఫిర్యాదులు అందడంతో ఉన్నత విద్యామండలి కార్యద ర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ ఈ మేరకు అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు.