calender_icon.png 1 January, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరిజిన్ డైరీ ఎండి ఆదినారాయణపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

29-12-2024 09:27:22 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ ప్రాంతంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆరిజిన్ డైరీ ఎండి కందిమల్ల ఆదినారాయణపై దాడికి పాల్పడ్డారు. తన స్నేహితుడు సుధాకర్ తో కలిసి కటింగ్ చేసుకునేందుకు హెయిర్ కటింగ్ షాప్ కు వచ్చాడు. షాపులో గిరాకి ఉండడంతో వీరిద్దరూ బయట నిలబడ్డారు. ఇంతలో ఆరుగురు వ్యక్తులు ఆదినారాయణను లాగి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆదినారాయణతో కలిసి వచ్చిన సుధాకర్ బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ దేవయ్యకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన స్థలానికి ఏసీపీ రవికుమార్, సీఐ దేవయ్య లు చేరుకుని బాధితుడు ఆదినారాయణను హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి దాడికి పాల్పడిన వ్యక్తులు పారిపోయారు.