calender_icon.png 8 January, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

06-01-2025 01:40:22 PM

కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్...

కూకట్ పల్లి (విజయక్రాంతి): ఫతేనగర్ డివిజన్ శాస్త్రి నగర్ లో రాయ్ ఆఫ్ జయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి హెల్త్ క్యాంపులు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరు ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకుని ఆరోగ్యం గా ఉండాలన్నారు. ఈ వైద్య శిబిరంలో 150 మంది పాల్గొన్నారు. బీపీ, షుగర్, క్రియాటిన్ టెస్ట్ లు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు జాకీర్, కుతాడి రాములు, జగన్ గౌడ్, లక్ష్మణ్, విశ్వనాథ్, బబ్బులు తదితరులు పాల్గొన్నారు.