calender_icon.png 18 April, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్ వాడి కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ

11-04-2025 05:01:24 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం ఐసిడిఎస్ టేకులపల్లి సెక్టార్ పరిధిలోని బేతంపూడి పంచాయతీ బేతంపూడి స్టేజి తండాలో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల ఎనిమిది నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా టేకులపల్లి సెక్టార్ సూపర్వైజర్ కె.అనురాధ ఆధ్వర్యంలో బేతంపూడి జీపీ లోని స్టేజతండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం పోగ్రాం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ టేకులపల్లి ప్రాజెక్టు అధికారి కే.యం, తారా హాజరయ్యారు. ఈ సందర్బంగా తల్లులకు 1000 రోజులు గురించి, పోషకాలు వున్నా ఆహారం తీసుకోవాలని, తల్లులకు అవగాహన కల్పించారు. అలాగే తల్లులతో చిరు ధాన్యాలతో వంట చేయించడం, అన్నప్రాసన, అక్షర బ్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ సుగుణ, లలితకుమారి, అరుణకుమారి, వెంకటనర్సమ్మ, గర్భిలు, బాలింతలు, కిశోర బాలికలు, పిలల్లు పాల్గొన్నారు.