29-03-2025 12:26:07 AM
ఇఫ్తార్ విందులో ఎస్పీ మహాజన్
ఆదిలాబాద్, మార్చ్ 28 (విజయక్రాంతి) : అందరూ సోదర భావంతో ఐక్యమత్యంగా ఉంటు పండగలను కలిసిమెలిసి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. ముస్లింల ప్రధాన పండగ రంజాన్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీ స్ హెడ్ క్వార్టర్‌లో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రార్థనలో అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు.
ఎస్పీ పలువు రికి స్వయంగా ఖర్జూరాలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ... ప్రజల సేవల కోసం శాంతి భద్రతల ను పరిరక్షిస్తూ, అందరూ కృషి చేయాలన్నారు. పండగలను మతసామరస్యానికి ప్రతీకగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, హసీబుల్లా, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.