19-03-2025 07:09:24 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జీఎం కార్యాలయంలో యాజమాన్యం, ప్రాతినిధ్య సంఘం ప్రతినిధుల మధ్య ఏరియా స్థాయి నెలవారీ సమావేశం జీఎం వి కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (SCMLU-INTUC) తరపున ఏరియా వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇల్లందు ఏరియాలో పనిచేసే కార్మికులు వారి పని స్థలాలలో ఎదుర్కొనే పలు సమస్యలను, విన్నపాల గురించి ప్రాతినిధ్య సంఘం తరపున ఏరియా జీఎం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కార దిశకై చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా ఏరియా జీఎం వి కృష్ణయ్య స్పందించి, సాధ్యమయ్యంత వరకు ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జి.యం. రామస్వామి, కే .ఓసి.పి. ఓ గోవింద రావు, ఏరియా ఇంజనీర్ ఆర్వీ నరసింహరాజు, ఫైనాన్స్ మేనేజర్ మధుబాబు, సివిల్ అధికారి వెంకటేశం, మేనేజర్ ఐటి సుధాకర్, ప్రాతినిధ్య సంఘం తరపున, బ్రాంచ్ సెక్రటరీ భూక్య నాగేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బండి రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.