- మండపాలకయ్యే కరెంట్ ఖర్చు నేనే చెల్లిస్తా
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఆగస్టు 31 (విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే వారంతా తప్పనిసరిగా తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సూచించారు. శనివారం కరీంనగర్ కమిషనరేట్‌లో కమిషనర్ అభిషేక్ మొహం తి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణపై సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ ంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. భక్తి శ్ర ద్ధలతో పూజిస్తేనే కోరికలు నెరవేరుతాయన్నారు.
ఉత్సవాలను ప్రశాంత వాతావరణం లో విజయవంతంగా నిర్వహించుకుని, కరీంనగర్‌ను ఆదర్శంగా నిలుపుదామన్నారు. పో లీసులు, అధికారులు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మండ పాల వద్ద నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూ చించారు. మండపాల వద్ద కరెంట్ సౌకర్యం కల్పించే విషయంలో విద్యుత్‌శాఖ అధికారు లు నిర్వాహకులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు.
గణేశ్ మండపాల నిర్వహణకు అ య్యే విద్యుత్ చార్జీలను తానే చెల్లిస్తానని మ ంత్రి బండి సంజయ్ తెలిపారు. నిమజ్జన స మయంలో ప్రత్యేకంగా అంబులెన్సులను ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమై తే ప్రైవేట్ ఆసుపత్రులు, హోటల్స్ అసోసియేషన్ నాయకుల సహకారం తీసుకోవాల న్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా స త్పతి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయ ణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమ టి రెడ్డి నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ చాహత్ వాజ్‌పేయి పాల్గొన్నారు.
కొత్తపల్లి బ్రిడ్జి ప్రారంభం
కొత్తపల్లిలో రూ.2.65 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమా ర్ శనివారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రార ంభంతో కొత్తపల్లి, మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంటతోపాటు కరీంనగర్‌వాసులకు, రైతులకు, మత్స్యకారులకు ప్రయోజనం కలగనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పాల్గొన్నారు.