29-04-2025 11:17:35 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): బీసీల హక్కులు, విముక్తి కోసం సంఘటిత పోరాటాలు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మే 5 నుంచి నిర్వహించబోయే రాష్ట్ర వ్యాప్త బీసీ మేలుకొలుపు యాత్రను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆ యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ంతటి పోరాటాలకైనా సిద్ధమన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చాపర్తి కుమార్‌గాడ్గే, రేవల్లి అజయ్, కుర్ర హరీష్, టీడీపీ నాయకులు నర్సింగరావు, రామురెడ్డి తదితరులు పాల్గొన్నారు.