calender_icon.png 30 April, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్లకే సంస్థాగత పదవులు

24-04-2025 02:06:21 AM

  1. 2017 నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికి ప్రాధాన్యం
  2. పీసీసీలో మార్పులు, కూర్పులకు శ్రీకారం
  3. మహిళ ప్రాతినిధ్యం పెంపునకు చర్యలు
  4. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాం తి): తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ (టీ పీసీసీ) ప్రక్షాళనకు ఏఐసీసీ సిద్ధమైంది. దీని లో భాగంగానే గ్రామస్థాయి నుంచి జిల్లాస్థా యి వరకు మార్పులు, కూర్పులకు శ్రీకారం చుట్టింది. 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికే సంస్థాగత పదవులు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకు మూ డు దశల్లో ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమైంది.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్ గౌడ్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి హాజరై కీలక అంశాలపై చర్చించారు. పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

గైర్హాజరైనోళ్లకు బాధ్యతలు కట్.. 

పీసీసీ మొత్తం 70 మంది పరిశీలకులకు ఆహ్వానం పంపించింది. సమావేశానికి కొం దరు ఆలస్యంగా రాగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వారిపై తీవ్రమైన అంసతృప్తి వ్యక్తం చేశారు. వారిని పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పించాలని పీసీసీని ఆదేశించారు. అలాగే సమావేశానికి గైర్హాజరైన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తో మరో ఐదుగురు పరిశీలకులను పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పించారు.

సంస్థాగత నిర్మాణం కీలకం: పీసీసీ చీఫ్

ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణలో జై భీం, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని, పార్టీ శ్రేణు లు కష్టపడి పనిచేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కొనియాడారు. కోఆర్టినేటర్లు తమ బాధ్యతలను సక్రమం గా నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదనలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.  స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి

ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనన్నాయని, కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ పదవుల వరకు దాదాపు లక్షన్నర పదవులు దక్కించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యావత్ దేశానికి రోల్ మోడల్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని కొనియాడారు. కుల గణనతో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో పాటు అనేక సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలి.. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ 

కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలతో నడుస్తోందని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ అన్నా రు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. ఇటీవల గుజరాత్‌లో ఏఐసీసీ నిర్వహించిన ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను  తెలంగాణలోనూ అమలు చేయా లని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మా ణం మరింత బలోపేతం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి ఘన చరిత్ర ఉంద ని, పార్టీత బ్రిటిష్ వాళ్లతో కూడా పోరా టం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా జాతీయ స్థాయి ఆలోచనలతోనే పని చేస్తుందని, ఆ సిద్ధాంతాలను నాయకులు జనంలోకి తీసుకెళ్లాల ని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా కుల గణన చేపట్టిందని కొనియాడారు. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టిందన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలకు మేలు చేస్తుందన్నారు.

దశ 1

ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశాలు 

డీసీసీ అధ్యక్షులు జిల్లాస్థాయి పార్టీ సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ , పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలి

దశ 2

పక్కాగా అసెంబ్లీ, బ్లాక్ లెవల్  సమావేశాలు నిర్వహణ. 

దశ  3

మండల స్థాయిలో పార్టీ సమావేశాలు. పార్టీ మండల అధ్యక్షుడి పదవికి ఐదు పేర్లు, గ్రామ అధ్యక్ష పదవికి ఐదు పేర్లు, బ్లాక్ లెవల్ పదవికి ముగ్గురి పేర్ల చొప్పున పరిశీల కులకు ప్రతిపాదనలు. పార్టీలో మహిళల ప్రాతినిధ్యం పెంపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదవు లు. జిల్లాకు ఇద్దరు పరిశీలకుల నియామకం.