calender_icon.png 26 November, 2024 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు ఏరియాలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ

26-11-2024 04:51:30 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి  ఇల్లెందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో  భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఓయస్డి వీసం కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఈ రాజ్యాంగం 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చిందన్నారు. అయితే రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు నవంబర్ 26 ను ఏటా భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటామని, దీన్నే సంవిధాన్ దివాస్ అని కూడా అంటామన్నారు. భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత ఉందని, పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛా, సమానత్వం, హక్కులు, సామజిక, ఆర్ధిక బేధాలు, వివక్ష లేకుండా ప్రజలను దేశంగా కలిపి ఉంచడంలో భారత రాజ్యాంగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తదుపరి ఉద్యోగులందరు కలిసి  ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో యస్ఓటూజియం బొల్లం వెంకటేశ్వర్లు, ఎజియం(ఐడి) గిరిధర్ రావు, ఏరియా ఇంజనీర్ నరసింహ రాజు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రామస్వామి, డిజియం పర్సనల్ జివి మోహన్ రావు, డిజియం సర్వే బాలాజీ నాయుడు, డిజియం సివిల్ రవికుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, ప్రాతినిధ్యసంఘం పిట్ కార్యదర్శి యాదగిరి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.