01-04-2025 12:17:37 AM
నిజమాబాద్, మార్చి 31 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలో కలక్టరేట్ ప్రాంగణం లో భారత ప్రభుత్వం యొక్క సేంద్రియ మరియు సహజ వ్యవసాయ ప్రాంతీయ కేంద్రం నాగపూర్ వారు ఉద్యాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారి సమన్వయంతో ఒక రోజు సేంద్రీయ మరియు సహజ వ్యవసాయం పైన రైతులకు శిక్షణ మరియు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిధిగా ఉద్యావ శాఖ మాజి సంచాలకులు వెంకటామి రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్, సేంద్రియ మరియు సహజ వ్యవసాయం వల్ల కలిగే లాభాలు ఆ పద్ధతిలో సాగు చేసే రైతుల కోసం భారత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు .
అలగే సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంట నమోదు మరియు ధ్రువికరణ విధానం గురించి వివరించి దానికి కావాల్సిన వివిధ పత్రాల గురించి చెప్పారు. తరువాత ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు చక్రపాణి మాట్లుడుతూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తోపాటు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ గురించి వాటి విశిష్టత మరియు దాని సాధక బాధకలు గురించి వివరించారు. అలాగే త్వరలో జిల్లా లోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గ రైతులతో ’నిజామాబాద్ జిల్లా ఫార్మర్ ప్రొడ్యూసర్ అర్గనైజేషన్’ ఏర్పాటు చేసి రైతులకి మార్కెట్ డైరెక్ట్ లింకేజి విధానంలో పంట అమ్మెలాగా ఎఫ్ పి ఓ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఎఫ్ పి ఓ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లడుతూ నాగపూర్ నుండి జిల్లా కేంద్రం వరకు వచ్చి ఇక్కడి రైతులకు సేంద్రీయ వ్యవసాయం పైన శిక్షణ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు అలాగే వారితో సమన్వయం చేసుకున్న ఉద్యాన శాఖ మరియు శాఖ సీనియర్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తు లో కూడా జిల్లా రైతులకు ఇంకా ఎన్నో శిక్షణ మరియు క్షేత్ర కార్యక్రమలు నిర్వహించి వారి అభివృద్ధికి తొడ్పడాలని ఉద్యాన శాఖ మరియు ఇతర అధికారులని కోరారు. చివరగా ముఖ్య అతిధి వెంకట్రామి రెడ్డి మాట్లడుతూ ఇంత మంచ శిక్షణ కార్యక్రమంకు నిజమాబాద్ జిల్లా వేదిక కావడం చాలా సంతోష కారమని అన్నారు.
అది విధంగా శిక్షణ తీసుకున్న రైతులు తప్పకుండా మెల్లిమెల్లిగా అయినా సేంద్రియ మరియు సహజ వ్యవసాయ పద్ధతిని అవలంభించుకోవాలని ఆకాంక్షించారు అలగే త్వరలో ఏర్పాటు అయ్యే నిజామాబాద్ జిల్లా ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేషన్ లో రైతులు వారంత వారిగా అసక్తి చూపించి సభ్యత్వం తీసుకొని అంచెలచెలుగా ఆ ఎఫ్‌పీవోని అభివృద్ధి చేసి నిజామాబాద్ జిల్లా రైతులను ఆరోగ్యంగా మరిదు అర్థికంగా అభివృద్ధి పరచాలని తెలిపారు. ఈ కార్యకమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ ఉద్యాన శాఖ అధికారులు సాయిబాబా, నర్సయ్య, రోహిత్, వినాయక్ జిల్లా లోని వివిధ ఎఫ్‌పీవో డైరక్టర్లు, జిల్లా రైతులు పాల్గొన్నారు.