05-02-2025 08:04:15 PM
మునగాల: మండల కేంద్రంలో శరీర అవయవదాన కార్యక్రమం స్పందన సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తి మరణతరం దేహదహనం చేసి బూడిద కారడం కన్నా అవయవదానం చేయడం వల్ల చనిపోయినప్పటికీ ఇతరుల జీవితాలలో వెలుగు నింపడం మహా సంకల్పమని సూర్యాపేట స్పందన శరీర అవయవదాన సంస్థ అధ్యక్షుడు గుండా రమేష్ అన్నారు. స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త అర్వపల్లి రాజారావు అవయవ శరీరదాన హామీ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పందన అవయవదాన ప్రధాన కార్యదర్శి మిట్టకోలు కోటయ్య, సూర్యాపేట సామాజిక వేత్త రమేష్ వాసవి క్లబ్ అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ వంగవేటి గురుమూర్తి, ఆర్యవైశ్య ప్రముఖులు పీవీడి ప్రసాద్, వాసవి క్లబ్ జోనల్ చైర్మెన్ కాపర్తి మణికంఠ కుమార్, మండల వాసవి క్లబ్ కార్యదర్శి బ్రహ్మదేవర అఖిల్, కోశాధికారి కందిబండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.