calender_icon.png 10 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవదానం మరింత సులభం

28-03-2025 01:47:54 AM

  1. కేంద్ర ప్రభుత్వ తోహా చట్టాన్ని అనుసరించనున్న రాష్ట్రం
  2. అసెంబ్లీలో అవయవదాన బిల్లును ప్రవేశపెట్టిన 
  3. మంత్రి దామోదర

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాం తి):  అవయవదానం చట్టంలోని లోపాల వల్ల అనేక మంది బాధితుల ఏండ్లుగా ఎదురు చూస్తున్నారని, అలాంటి వారికోసం నూతన అవయవదాన చట్టాన్ని తీసుకొచ్చినట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

గురువారం అసెంబ్లీలో అవయవ మార్పిడి  చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడారు. అవయవదానానికి సంబంధించి 1994లో కేంద్రం తోహా (ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్) చట్టం చేసిందన్నారు. ఈ చట్టానికి 2011లో సవరణలు చేయడంతో దీన్నే తోట (ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్) చట్టంగా పిలుస్తున్నారని అన్నారు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోహా 1994 (తోట చట్టాన్ని, నిబంధనలను అడాప్ట్ చేసుకుంటున్నట్టు వివరించారు. దీంతో అవయవదానానికి సంబంధించి నిబంధనలు మరింత సులభతరం కానున్నట్టు చెప్పారు.  స్వాప్ విధానం కూడా అమల్లోకి వచ్చిందని దీని ద్వారా ఒకరి నుంచి మరొకరికి అవయవదానం కోసం మార్పిడి అవకాశం లభిస్తుందన్నారు.

అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిలో ప్రమే యం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించే లా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి అవయవ మార్పిడి చేస్తే గతంలో రూ.5 వేల జరి మానా, 3 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేదని.. కొత్త నిబ ంధనల ప్రకారం రూ.కోటి వరకు జరిమానా తో పాటు పదేళ్ల జైలు శిక్ష విధిం చవచ్చన్నారు.

స్వాగతిస్తున్నాం... కొన్ని మార్పులు చేయాలి: మాజీమంత్రి, హరీశ్‌రావు

బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబాల కు అవయవదానంపై అవగాహన కల్పించాలని.. అలాంటి వారికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని.. వారు పేదలైతే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అం డగా నిలవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. అవయవదాన బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తమ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 609 అవయవమార్పిడి చికిత్సలు చేశామ ని.. ఇందులో 577 కేసులు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితంగా చేశామన్నారు.  

కిడ్నీ రాకెట్లను అరికట్టాలి: బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు

హైదరాబాద్‌లో అలకనంద హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ ఘటన ఎంతో ఆందోళన కలిగించింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రం తీసుకొచ్చిన కేంద్ర చట్టాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. అవయవ దానాల్లో ప్రత్యేకత చూపుతున్న నిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు ప్రభు త్వం మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.

డాక్టర్ మధుసూదన్ పేదలకు కొత్త జీవితాన్ని అందిచారు: ఎమ్మెల్యే కవ్వంపల్లి 

సర్కారు సహాయం లేనప్పుడే ఉస్మానియాకు చెందిన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మధుసూదన్ కాలేయ మార్పిడితో ఎంతో మంది పేదలను బతికించారు. అలాంటి వారి సేవలను ప్రభుత్వం గుర్తించాలి.

అవయవదానానికి  నేను సిద్ధం: కేటీఆర్

అవయవ దానానికి తాను సిద్ధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ముందుకు వచ్చారు. అవయవ దానం బిల్లు ఆమో దం సందర్భంగా మాట్లాడుతూ... అవయ వ దానానికి తాను ముందు వరుసలో ఉంటానని ఇందుకు ఎప్పుడూ సిద్ధమని తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు.