అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు సీతామహాలక్ష్మి
మహబూబ్‌నగర్, ఆగస్టు 13 (విజయక్రాంతి): అవయవదానం చేస్తే ప్రాణదానం చేసినట్లు అవుతుందని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు డాక్టర్ గుడూరు సీతామహాలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఎడ్యూకేషన్ సొసైటీ కళాశాలలో అవయవదానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో వృథాగా కలిసిపోతాయని, అలాకాకుండా అవయవాలను దానం చేస్తే ఎంతో ఉపయోకరంగా ఉంటుందని వివరించారు.
మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించడం ద్వారా మెడికల్ విద్యార్థులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుందని వివరించారు. కార్యక్ర మంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ కాట్రగడ్డ భారతి, జల్లి ఉదయ్ కుమార్, బొడ్డుపల్లి కేశవులు, కన్యాకుమారి, ఆర్మికృష్ణ, డాక్టర్ కేపీ జోషి, దీలీప్, డాక్టర్ సునీల్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సంతోష్ పాల్గొన్నారు.