calender_icon.png 28 November, 2024 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యాక్టరీ పనులు నిలిపివేతకు ఆదేశాలు

27-11-2024 10:42:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండల కేంద్రంలో గ్రామాలు పంట పొలాల మధ్య ఓ ప్రైవేటు కంపెనీ నిర్మిస్తున్న ఇత్తనాలు ఫ్యాక్టరీ నిర్మాణం పనులను ఆపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. నాలుగు గ్రామాల రైతులు విత్తనాలు ఫ్యాక్టరీ వల్ల తమకు నష్టం కలుగుతుందని ఆందోళన చేశారని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లను పరిగణలో తీసుకొని ఫ్యాక్టరీ పనులు ఆపేందుకు నిర్ణయం తీసుకుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.