2022 జూలై 1 నుంచి వర్తింపు
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): దీపావళి పండుగ వేళ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు డీఏను పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ డీఏ 2022 జూలై 1 నుంచి వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. న
వంబర్ 1 న వచ్చే వేతనం జీపీఎఫ్‌లో ఈ డీఏను జమచేయనున్నట్లు సర్కారు పేర్కొంది. అలాగే వచ్చే ఏడాది మార్చి 31లోపు పదవీవిరమణ చేసే ఉద్యోగులు, జీపీఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 వాయిదాల్లో చెల్లిస్తామని వివరించింది.