11-03-2025 11:54:56 PM
2019 నాటి ఘటనలో కేసు నమోదుకు సై...
న్యూఢిల్లీ: అధికారంలో ఉండగా.. 2019లో ద్వారకలో ఆప్ ప్రభుత్వం భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. అయితే ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రజానిధుల దుర్వినియోగం ఆరోపణలపై 2022లో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ ఫిర్యాదును తోసిపుచ్చగా.. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ మీద కేసు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ పరిణామం కేజ్రీవాల్‌కు షాక్‌గానే చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన పార్టీ తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. అనేక ఆరోపణల నడుమ ఎన్నికలకు వెళ్లిన ఆప్‌కు చుక్కెదురైంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.