14-02-2025 01:12:55 AM
నామినేషన్ తిరస్కరణపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభ ద్రుల నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ను ఆమోదించేలా జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీచేయాలని సిద్దిపేట జిల్లా చిన్నకుందూ రు మండలం కస్తూరిపల్లికి చెందిన పోచబోయిన శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు.
తన ఎమ్మెల్సీ నామినేషన్ ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ శ్రీహరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తన నామినేషన్‌ను స్వల్ప కారణాలతో ఈనెల 12న తిరస్కరించారన్నారు. నామినేషన్ తిరస్కరణపై జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు.
చిన్నచిన్న కారణాలతో నామినేషన్‌ను తిరస్కరించారన్నారు. జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.