కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి వేగంగా భూసేకరణ చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. నగరంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ (ఎస్‌హెచ్-01), ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫామ్ (ఎన్‌హెచ్-44) వరకు నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్‌ను ఆయన మంగళవారం జారీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టర్లు, సబ్రిజిస్ట్రార్లు, సర్వేయర్లతో రెవెన్యూ గ్రామాల వారీగా భూ సేకరణపై సమీక్షించారు.
లబ్ధిదారులకు సబ్సిడీ అందించాలి
హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందించిన వాహనాల కు సబ్సిడీని వెంటనే అందించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కలెక్టరేట్లో వాహనాల సబ్సిడీపై శాఖలవారీగా సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం పవన్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, డీటీడబ్ల్యూవో కోటాజీ, అధికారులు పాల్గొన్నారు.