calender_icon.png 22 January, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బత్తాయి రైతు బేజారు!

16-07-2024 03:28:54 AM

  • భారీగా తగ్గిన పండ్ల ధర 
  • టన్ను రూ.15 వేలలోపే 
  • పెట్టుబడే రావట్లేదని రైతుల ఆవేదన 
  • నల్లగొండ జిల్లాలో 45 వేల ఎకరాలకుపైగా సాగు 
  • బత్తాయి మార్కెట్ ఉన్నా ఫలితం సున్నా 

నల్లగొండ, జూలై 15 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతులు బేజారవుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకుంటున్నా రు. జిల్లాలోని నాగార్జునసాగర్ నాన్ ఆయకట్టు మండలాల్లో బత్తా యి ఎక్కువ సాగవుతుంది. ఈ ఏడాది సరిగ్గా వర్షాలు లేకపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.

దిగుబడి తగ్గడం, వచ్చిన పంటకు సరైన ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎకరం బత్తాయి సాగు చేసేందుకు సుమారు రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. 5 టన్నులు దిగుబడి వస్తే కొద్దోగొప్పో గిట్టుబాటు అవు తుంది. కానీ, ప్రస్తుతం 2 నుంచి 3 టన్నులలోపే దిగుబడి వస్తుండటం, ధర సైతం పతనమవడంతో నష్టాలే మిగులుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.   

45 వేల ఎకరాల్లో సాగు 

ఉద్యానశాఖ లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 45 వేల ఎకరాల్లో రైతులు బత్తాయి సాగవుతుంది. ఈసారి 3 లక్షల టన్నులకుపైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ప్రత్యామ్నాయ నీటి వనరుల ద్వా రా తోటలను కాపాడుకునేందు కు రైతులు భగీరథ ప్రయత్నం చేశారు. కష్టాలకోర్చి పండించిన అరకొర పంటను అమ్మునేందుకు ప్రస్తు తం వా రికి అవస్థలు తప్పడం లేదు. మార్కెట్ ఉన్నా ట్రేడర్లు లేకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది.  

కాసులు కురిపించని కత్తెర దిగుబడి

బత్తాయి రెండు దఫాలుగా దిగుబడి వ స్తుంది. కత్తెర, సీజన్ కాయ. ఏప్రిల్ నుంచి మే వరకు కత్తెర కాపు వస్తుండగా.. ఆగస్టు వరకు సీజన్ కాపు వస్తుంది. సహ జంగా కత్తెర కాయ రుచిగా ఉండి రసం అధికంగా రావడంతో మంచి ధర పలుకుతుంది. గత రెండేళ్లు కత్తెర కాయకు భారీగా డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొన్నారు.

ఓ దశలో టన్ను రూ.50 వేలకుపైగా పలకడంతో రైతులు భారీగా లాభా లను గడించారు. కానీ, ఈ ఏడాది వర్షాభావం, వాతావరణం సహకరించక తెగుళ్లు రావడంతో కాయలు నాణ్యత తగ్గి ట న్ను రూ.22 వేల నుంచి రూ.25 వేల మధ్యే పలికింది. ప్రస్తుతం సీజన్ కాయ మార్కెట్లోకి వ స్తుండటంతో దళారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో ధర పడిపోయి రైతులు నష్టపోతున్నారు. 

20 ఏండ్లుగా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

1980 నుంచి జిల్లాలో బత్తాయి సాగు ప్రారంభమైంది. రెండు దశాబ్దాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి 2.5 లక్షల ఎకరాలకు చేరింది. ఆ తరువాత వివిధ రకాల తెగుళ్ల కారణంగా తోటలు ఎండిపోయి విస్తీర్ణం భారీగా తగ్గింది. 2016 నాటికి లక్ష ఎకరాలకు పడిపోగా.. 2023 నాటికి దాదా పు 50 వేల ఎకరాలకు చేరింది. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడం, దళారులు బెడద, వర్షాభావ పరిస్థితుల కార ణంగా బత్తాయితో లాభం లేదని తోటలను తీసేసి ఇతర పంటలు పండించేందుకు రైతులు మొగ్గు చూపుతుండడంతో సాగు మరింత పడిపోయే అవకాశం ఉంది. 

మార్కెట్ ఉన్నా ఫలితం శూన్యం

నల్లగొండ శివారులో ఎస్సెల్బీసీ ప్రాం తంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో బత్తాయి మార్కెట్‌ను ఏర్పా టు చేసింది. నాటి నుంచి ఏపీలోని కర్నూల్ వ్యాపారులదే ఇక్కడ పైచేయి. వారు నిర్ణయించిందే ధరే ఫైనల్. ట్రేడ ర్ల మధ్య పోటీ లేకపోవడం, మార్కెట్ లో అమ్మేందుకు రైతులు ఆసక్తి చూపకపోవడంతో బత్తాయి మార్కెట్ నిరుపయో గంగా మారింది. దీంతో తోటల వద్దకే దళారులు వెళ్లి రైతులతో రేటు మాట్లాడుకొని కొనుగోలు చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. హైదరాబాద్‌లోనే బత్తాయి పంట్ల మార్కెట్ ఉన్నా మార్కెట్ ధరపై అవగాహన లేని ఇక్కడి రైతులు అమాయకంగా దళారులను నమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తు తం మార్కెట్‌లో బత్తా యి టన్ను రూ.22 వేలకుపైగా నడుస్తుండగా రైతుల వద్ద రూ.15 వేలకే కొనుగోలు చేసి లారీల్లో హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 

రైతులు నేరుగా మార్కెట్ చేసుకుంటే లాభం 

బత్తాయి రైతులు సంయుక్తంగా (ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసుకొని సొంత బ్రాండ్‌తో పంట ఉత్పత్తిని మార్కెట్ చేసుకుంటే మంచిది. బత్తాయి ధర మార్కెట్‌లో ఒడిదుడుకులకు లోనవడం సహజం. వేసవిలో కాపు తక్కువగా ఉండటం.. వినియోగం ఎక్కువగా ఉండటంతో ధర అధికంగా ఉంటుంది. సీజన్ కాయ దిగుబడి అధికంగా ఉండటంతో రేటు కాస్త తగ్గొచ్చు. బత్తాయిలకు గ్రేడింగ్ విధానంలో సైజును బట్టి రేటు నిర్ణయిస్తారు. మార్కెట్‌లో రేటును నిర్దారించుకొని రైతులు జాగ్రత్తగా మార్కెట్ చేసుకుంటే నష్టం రాదు. దళారులను నమ్మి మోసపోవద్దు. 

 -సంగీత లక్ష్మి, నల్లగొండ జిల్లా ఉద్యాన అధికారి