calender_icon.png 31 October, 2024 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

17-07-2024 10:23:12 AM

హైదరాబాద్: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో జూలై 18 నుంచి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రేపటి నుంచి మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో  రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమంత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాల్లో 11-20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఆయా జిల్లాల అధికారులను ఐఎండీ అలెర్ట్ చేసింది. 

ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. జూలై 20 వరకు నగరంలో వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) గణాంకాల ప్రకారం నిన్న కుమురం భీమ్ జిల్లాలో అత్యధికంగా 137.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మెదక్‌ జిల్లాలో 26.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌, తిరుమలగిరిలో 29.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. కురుస్తున్న భారీ వర్షాలపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.