calender_icon.png 26 November, 2024 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలరాకు ఓరల్ వ్యాక్సిన్

28-08-2024 12:11:30 AM

మార్కెట్‌లోకి తీసుకొచ్చిన భారత్ బయోటెక్ 

హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): ఓరల్ కలరా వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ హిల్ కాల్ ’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. 2023 మార్చి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 8,24,479 మందికి కలరా సోకగా, 5,900 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 31 దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరతను దృష్టిలో  ఉంచుకుని ఓరల్  వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.